‘రంభ ఊర్వశి మేనక’ కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు: హీరో అల్లరి నరేష్
అల్లరి నరేష్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘రంభ ఊర్వశి మేనక’ ఈరోజు రిలీజ్ అయింది. సింగిల్ స్క్రీన్స్, బి, సి సెంటర్స్‌లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. శని, ఆదివారాలు ఏ సెంటర్స్‌లో కూడా పికప్ అవుతుంది. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా ఇది. ప్రేక్షకులు…
