‘ది ప్యారడైజ్’ లో సుబ్బలక్ష్మి గా కయాదు లోహర్
నేచురల్ స్టార్ నాని పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' పై అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఆయా షేర్' సింగిల్ విడుదల తర్వాత నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ప్రతి పాత్ర రివల్ తో ఆసక్తిని మరింత పెంచుతోంది. అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌గా, హీరోయిన్ కయాదు లోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర నిర్మాతలు ఈరోజు ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కయాదు లోహర్ 'ది ప్యారడైజ్' ప్రపంచంలోకి సుబ్బలక్ష్మి (సుబ్బు)పాత్రలో అడుగుపెట్టింది. సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్ ప్రపంచంలో సాగుతున్నప్పటికీ, ఆమె పాత్ర ఆ కథకు ఓ సాఫ్ట్ టచ్ అందించనుందని…
