మంగ్లీ కేసుతో నాకు సంబంధం లేదు – డైరెక్టర్ వేణు ఊడుగుల
ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఈ అసత్య వార్తలపై వివరణ ఇచ్చారు దర్శకుడు వేణు ఊడుగుల. మంగ్లీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వేణు ఊడుగుల స్పందిస్తూ - గాయని మంగ్లీ కేసులో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న వార్తలు చూసి బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా…
