Skip to content

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు నటి లయ. "తమ్ముడు" సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు నటి లయ. - నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. ఇక్కడ…

Read more

తెలుగు సినీ & టివి కాస్టూమర్స్ యూనియన్ నాయకుల దోపిడీని అరికట్టండి

న్యాయం జరిగేవరకు మా పోరాటం ఆగదు! భూ పోరాట సమితి కన్వీనర్ సీనియర్ సభ్యులు రమేష్ "తెలుగు సినీ & టివి కాస్టూమర్స్ యూనియన్ నాయకుల దోపిడీని అరికట్టండి" అని పిలుపునిస్తున్నారు సదరు సంఘం సీనియర్ సభ్యులు, భూ పోరాట సమితి నాయకులు రమేష్. ఆయన మాట్లాడుతూ... "తెలుగు సినీ అండ్ టీవీ కాస్ట్యూమర్స్ యూనియన్ 330 మంది సభ్యులకి 2017 సంవత్సరంలో మెంబర్స్ అందరికీ భూమి కొనిస్తామని డబ్బులు వసూలు చేసి 20 ఎకరాలకి అగ్రిమెంట్ చేసి 16 ఎకరాల 36 గుంటలకి యూనియన్ నుంచి డబ్బు కట్టి 13 ఎకరాల 12 గుంటలకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి ప్రస్తుతానికి భూమి అంతా పోయినట్టు చెబుతూ 7 ఎకరాల 2 గుంటలు…

Read more

జూన్ 27న మరో మహాశివుని చిత్రం ‘చంద్రేశ్వర’ గ్రాండ్‌గా విడుదల

జూన్ 27న మరో శివుని చిత్రం విడుదల కాబోతోంది. ‘కన్నప్ప’తో పాటు మహాశివుడి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘చంద్రేశ్వర’. ‘అదృశ్య ఖడ్గం’ అనేది ట్యాగ్‌లైన్. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో.. సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించిన ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘చంద్రేశ్వర’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సాంగ్స్ అన్నీ కూడా ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, జూన్ 27న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ.. ‘‘శివుడి ఆజ్ఞ…

Read more

‘కన్నప్ప’లో ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా ఉంటాయి : శివ బాలాజీ

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బుధవారం నాడు శివ బాలాజీ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. * ‘కన్నప్ప’ కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు అని విష్ణుని మోహన్ బాబు గారు అడిగారు. శివ బాలాజీ చేసే పాత్ర ఇందులో కనిపించలేదు అని విష్ణు అన్నారు. లేదు…

Read more

జూలై 5న హుషారు రీ-రిలీజ్

యువతను నవ్వించి, వివిద భావోద్వేగాలతో మనసును హత్తుకున్న చిత్రం హుషారు మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాలేజీ రోజుల అనుభూతులను, స్నేహితుల మధ్య బంధాన్ని, యువత ఎదుర్కొనే సవాళ్ళను హాస్య, భావోద్వేగాలతో తీసిన ఈ చిత్రం జూలై 5న రీ-రిలీజ్ కానుంది. లక్కీ మీడియా, ASIN, HK ఫిలిమ్స్ సమర్పణలో, లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ , రియాజ్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొంగంటి దర్శకత్వం వహించారు. మొదటి విడుదల సమయంలోనే ఈ చిత్రం యూత్‌లో భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే క్రేజ్‌తో థియేటర్లకు తిరిగి వస్తోంది. ఈ చిత్రంలో తేజస్ కంచెర్ల, తేజ్ కురపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్ వంటి…

Read more

ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ లాంటి సినిమాలు విజయాన్ని సాధించాలి : మురళీ మోహన్

మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు , మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మురళీ మోహన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో.. మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘నా పుట్టిన రోజుని ఎప్పుడూ కూడా…

Read more

నేను రెడీ టైటిల్, గ్లింప్స్ రిలీజ్

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ "నేను రెడీ". ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న "నేను రెడీ" మూవీ టైటిల్, గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ - కుబేర సినిమా హిట్…

Read more

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన " పోలీస్ వారి హెచ్చరిక" టీజర్ ను తన కార్యాలయంలో సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. కాగా నేడు నవ దళపతి సుధీర్ బాబు చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ విడుదల కావడం జరిగింది. ఈ సందర్భంగా నవ దళపతి సుధీర్ బాబు మాట్లాడుతూ... "దర్శకుడు బాబ్జీ మా మామగారైన సూపర్ స్టార్ కృష్ణ గారికి బాగా దగ్గరివాడు. దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణ…

Read more

హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన నటిస్తున్నారు. వెటరన్ దర్శకుడు చంద్రన్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీలంకలో చిత్రీకరించబడింది. 'రిజానా - ఎ కేజ్‌డ్ బర్డ్' అనే ఈ సినిమా ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందించబడుతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి వరలక్ష్మి మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న జెరెమీ ఐరన్స్ వంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నిజంగా ఒక కల నెరవేరినట్టు అనిపిస్తోంది. లయన్ కింగ్‌ సినిమాలో స్కార్ పాత్రకు ఆయనే వాయిస్ ఇచ్చారు. ఆ సినిమా నాకు ఇష్టం. అన్ని డైలాగులు నాపక్కా గుర్తుండిపోతాయంతగా చూసాను. ఇప్పుడా సినిమాకు వాయిస్ ఇచ్చిన ఆయనతో నేను నటించడం…

Read more

జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జూన్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నేడు ఈ చిత్రం నుండి విడుదలైన దం దిగా దం పాటకు ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించగా యాసిర్…

Read more