Skip to content

‘గాయపడ్డ సింహం’ లో ఫన్, కామెడీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి : డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్

‘గాయపడ్డ సింహం’ లో ఫన్, కామెడీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి : డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ Telugu News
గాయపడ్డ సింహం’ లో ఫన్, కామెడీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి : డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ Telugu News

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ జర్నీ గురించి?
2010లో కాలేజీలో ఉన్నప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ట్రెండ్ మొదలైయింది. నాకు మొదట్లో యాక్టర్ అవ్వాలని ఉండేది. ఆడిషన్స్‌కు వెళ్లేవాడిని. కానీ రిజెక్ట్ అవ్వడం కామన్. (నవ్వుతూ) నన్ను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కోసమా అని అడిగేవారు. తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేసి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాను.

షార్ట్ ఫిలిమ్స్ చేసే ప్రాసెస్‌లో రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ అన్నిటిపై ఆసక్తి ఏర్పడింది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చేశాను. ఆ తర్వాత కొన్ని సినిమాలకు పని చేసే అవకాశం వచ్చింది. దర్శకుడిగా ‘గాయపడ్డ సింహం’తో వస్తున్నాను.

తరుణ్ భాస్కర్ గారిని తీసుకోవడానికి కారణం?
ఈ కథకి టిపికల్ హీరో అవసరం లేదు. ఇందులో హీరో క్యారెక్టర్.. హీరోగా ఫీల్ అయితే ఆడియన్స్‌కు నవ్వు రావాలి. అలాంటి కథ, క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ కు తరుణ్ భాస్కర్ గారు యాప్ట్.

-ఇందులో క్యారెక్టర్లు అన్నీ కూడా వాళ్ల లైఫ్‌లో చాలా సీరియస్‌గా ఉంటాయి. వారిని చూస్తున్నపుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నవ్వొస్తుంది.

బాలయ్య గారి రిఫరెన్స్ వాడటానికి కారణం?
బాలయ్య గారు వాడిన ‘నవ్వకు… ఇది సీరియస్ మ్యాటర్’ అనే మాటను వాడడం జరిగింది. అలాగే ఈ సినిమా టైటిల్‌లో కూడా ‘సింహం’ ఉంది. ‘సింహం’ అంటే ముందుగా గుర్తొచ్చేది బాలయ్య గారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు ఇది యాప్ట్‌గా ఉంటుంది. బాలయ్య బాబు లాంటి పవర్‌ఫుల్ వ్యక్తులకు ఉండే టైటిల్‌ను తరుణ్ భాస్కర్ లాంటి క్యారెక్టర్‌కు పెడితే ఖచ్చితంగా కాంట్రాస్ట్‌గా ఉంటుంది. బాలయ్య బాబు గారు అంటే మనందరి జీవితంలో ఒక భాగం. వాళ్లు వాడే మాటలు వాడితే ఒక రిలేటబిలిటీ వస్తుంది. ఆ ఆలోచనతో ఈ టైటిల్ పెట్టాం.

కథ ఎలా ఉండబోతుంది?
ఇందులో తరుణ్ భాస్కర్ తన ప్రేమ కోసం అమెరికా వెళ్లి, అక్కడ డిపోర్టేషన్‌కు గురై మళ్లీ ఇండియాకు వస్తాడు. ఏ కారణం చేత తిరిగి వచ్చాడో, ఆ ఫ్రస్ట్రేషన్‌తో తీసుకునే నిర్ణయాలు ఎంత ఫన్ క్రియేట్ చేశాయో అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

జేడీ గారి ధర్మ పాత్ర పూర్తిగా డిఫరెంట్. అక్రమ రవాణాలో ఉండే క్యారెక్టర్. తరుణ్, ధర్మ ఈ రెండు పాత్రలు ఎలా కలుస్తాయో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కథ చాలా కొత్తగా ఉంటుంది. కానీ ఇప్పుడే ఎక్కువ చెప్పలేను. తెలిసిన కథలాగే అనిపించినా, అందులో జరిగే సంఘటనలు ప్రేక్షకులు ఊహించలేరు.

నిర్మాతల గురించి?
ఇది చిన్న సినిమా అనుకుని మొదలుపెట్టాను. కానీ నిర్మాతలు కథకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంచి స్కేల్‌లో తీశారు. ఒక సీక్వెల్ కూడా అనుకున్నాను. ఆ ఐడియాపై నిర్మాతలు చాలా ఎక్సైట్ అయ్యారు. నేను ఊహించిన క్యారెక్టర్లకు సరిపోయే నటీనటులను ఇచ్చారు. నేను రాసుకున్న దానికంటే అద్భుతంగా వచ్చింది. నిర్మాతలు సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు.

డార్క్ కామెడీ అంటే ‘మనీ’ సినిమా గుర్తొస్తుంది కదా… ఇది ఎలా ఉండబోతుంది?
‘మనీ’ సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ గుర్తుంటుంది. అందులో తనను తాను హీరోగా ఫీల్ అవుతాడు. ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా హీరోగానే ఫీల్ అవుతుంది. ఇందులో అందరూ ఖాన్ దాదాలే (నవ్వుతూ).

పవన్ సాదినేని, జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్… ఇలా ఇందులో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, అందర్నీ ఎలా హ్యాండిల్ చేశారు?
నాకు అదే మంచి అడ్వాంటేజ్ అయింది. డైరెక్టర్స్‌గా వాళ్లు అన్నీ అర్థం చేసుకుంటారు. పవన్ గారికి నా టైమింగ్ తెలుసు. తరుణ్ గారు చాలా ఫ్రెండ్లీ. ఆయన మీద ఆయనే జోక్స్ చేసుకుంటారు. ఇందులో నేను కూడా యాక్టింగ్ చేశాను. నా పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటుంది. నిజానికి యాక్టింగ్ చేయకూడదనుకున్నాను. కానీ పవన్ గారు, యూనిట్ అందరూ ఆ పాత్రను నేనే చేయమన్నారు. అలా యాక్టింగ్ చేశాను.

శుభలేఖ సుధాకర్ గారితో కేజీఎఫ్ స్టైల్ నరేషన్ చెప్పించాం. అది చాలా ఫన్‌గా వచ్చింది. ఈ సినిమాలో మొదటి సీన్ నుంచే మంచి కామెడీ ఉంటుంది. డైలాగ్, విజువల్, యాక్షన్, సిచ్యుయేషనల్.. ఇలా అన్ని రకాల కామెడీ ఉంటుంది.

చిన్నప్పటి నుంచి నాకు ఇమిటేషన్ అలవాటు. అలాగే నా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్‌లో స్పూఫ్స్ ట్రై చేశాను. అవి బాగా వైరల్ అయ్యాయి. ఆ అనుభవం మొత్తం ఈ సినిమాకు ఉపయోగపడింది.

ఈ సినిమాకి ట్రంప్ గారే ప్రమోషన్ చేస్తున్నారు కదా… ఎలా అనిపిస్తోంది?
ఇది ఎవరికీ కుదరదు (నవ్వుతూ). ఆ క్యారెక్టర్ రాసుకున్న తర్వాత ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత టైమ్‌లైన్ మార్చుకున్నాను. అయితే అది మొత్తం కామిక్‌గా ఉంటుంది.

మానస, ఫరియా క్యారెక్టర్స్ గురించి?
మానస వల్లనే తరుణ్‌కు ఒక సమస్య వస్తుంది. ప్రజెంట్ టైమ్‌లో ఫరియా పాత్ర ఉంటుంది.

ఇందులో జేడీ చక్రవర్తి గారి ధర్మ పాత్రలో ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్‌లింక్ ఉంటుంది. అది ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

సినిమాకి సీక్వెల్ ఉంటుందా?
-ఈ కథకి సీక్వెల్ చేసే అవకాశం ఉంది.