Skip to content

‘సింగ’- మాస్ అప్పీలింగ్ గూస్ బంప్స్ టైటిల్ ప్రోమో రిలీజ్

‘సింగ’- మాస్ అప్పీలింగ్ గూస్ బంప్స్ టైటిల్ ప్రోమో రిలీజ్ Telugu News

టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’తో అలరించబోతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ నిర్మాణ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను కూడా రివీల్ చేశారు.

పక్షుల కిలకిలారావాలతో ప్రారంభమయ్యే ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను దట్టమైన అడవి మధ్యలోకి తీసుకెళ్తుంది. ట్రైబల్ నేపథ్య సంగీతం ఆసక్తిని మరింత పెంచుతుంది. చీకటిలో మెరుస్తున్న రెండు కళ్లను చూస్తే మొదట అడవిలో సంచరిస్తున్న పాంథర్ అనిపిస్తుంది. అయితే వెంటనే గోపీచంద్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కళ్లలో ఆగ్రహం, చేతిలో గొడ్డలి, ప్రతీకారంతో రగిలిపోతున్న పాంథర్‌లా కనిపిస్తూ పవర్ ఫుల్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. తర్వాత ‘సింగ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను రివీల్ చేశారు. టైటిల్ డిజైన్ కూడా ఎంతో ఆకట్టుకునేలా ఉంది.

టైటిల్ టీజర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో రూపొందింది. గడ్డం, మీసం, చెవిపోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్‌లో గోపీచంద్ అదరగొట్టారు. అభిమానులకు ఇది పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్‌గా నిలిచింది.

ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్ దర్శకుడిగా హీరోను ఎంత పవర్‌ఫుల్ మాస్ అవతార్‌లో చూపించాలో ఈ గ్లింప్స్‌తోనే నిరూపించారు. గోపీచంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. డివోపీ షామ్‌దత్, హీరో పాత్రను బిల్డ్‌అప్ చేసి రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంది. మరోవైపు సామ్ సిఎస్ అందించిన ట్రైబల్ నేపథ్య సంగీతం, రియలిస్టిక్ సౌండ్ డిజైన్ ఎనర్జీతో కట్టిపడేసింది.

యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ ఫుల్ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించేలా వెంకట్ ఒక గ్రిప్పింగ్ నేరేటివ్‌ను సిద్ధం చేశారు. యాక్షన్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా ఆయన చేస్తున్న ఈ ప్రయాణంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో మలయాళ నటి అనార్కలి నజర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. రామకృష్ణ-మోనికా ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తుండగా, సచిన్ సుధాకరన్-హరిహరన్ సౌండ్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు.

See also  గోదారి గట్టుపైన మూవీ నుంచి ఓ మై గాడ్ ఫిబ్రవరి 14న రిలీజ్

‘సింగ’ చిత్రంతో 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ మరోసారి నాణ్యమైన కథల పట్ల తమ నిబద్ధతను చాటుతోంది. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన సినీ అనుభూతిని అందించేందుకు మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు.

తారాగణం: టి గోపీచంద్, అనార్కలి నాజర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వివెంకట్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్
DOP: షామ్‌దత్ ISC
సంగీతం: సామ్ సిఎస్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్: రామ కృష్ణ-మోనిక
సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్-హరిహరన్
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.