‘సింగ’- మాస్ అప్పీలింగ్ గూస్ బంప్స్ టైటిల్ ప్రోమో రిలీజ్
టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’తో అలరించబోతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ నిర్మాణ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను కూడా రివీల్ చేశారు. పక్షుల కిలకిలారావాలతో ప్రారంభమయ్యే ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను దట్టమైన అడవి మధ్యలోకి తీసుకెళ్తుంది. ట్రైబల్ నేపథ్య సంగీతం ఆసక్తిని మరింత పెంచుతుంది. చీకటిలో మెరుస్తున్న రెండు కళ్లను చూస్తే మొదట అడవిలో సంచరిస్తున్న పాంథర్ అనిపిస్తుంది. అయితే వెంటనే…
