లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ముందుకు…
‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’లో స్కెలెటర్ కు మూడు వెర్షన్లలో వాయిస్ ఇచ్చిన ఆదిత్య మీనన్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” జూన్ 5న భారతదేశంలో ఘనంగా విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో ప్రముఖ విలన్ పాత్ర స్కెలెటర్‌కు హిందీ వెర్షన్‌లో ప్రముఖ నటుడు జావేద్ జాఫ్రీ వాయిస్ అందిస్తుండగా, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన గాత్రాన్ని అందించడం విశేషం.
ఈ సందర్భంగా ఆదిత్య మీనన్ మాట్లాడుతూ, “హీ-మ్యాన్ ఫ్రాంచైజీతో నాకు చిన్ననాటి నుంచి ఎంతో అనుబంధం ఉంది. స్కెలెటర్ వంటి ఐకానిక్ విలన్‌కు మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పడం నాకు ఒక అద్భుతమైన అనుభవం. మా తరం ప్రేక్షకులకు స్కెలెటర్ అత్యంత గుర్తుండిపోయే ప్రతినాయకుల్లో ఒకరు. అలాంటి పాత్రకు గాత్రం అందించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. స్కెలెటర్ పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అతను ఒకవైపు భయంకరంగా కనిపిస్తూనే మరోవైపు చాలా నాటకీయమైన శైలిని కలిగి ఉంటాడు. ఆ లక్షణాలు నటుడిగా నాకు ఎన్నో కొత్త ప్రయోగాలు చేసే అవకాశాన్ని ఇచ్చాయి. ప్రతి భాషకు ఒక ప్రత్యేకమైన శైలి, రిథమ్ ఉండటంతో ప్రతి వెర్షన్‌ను భిన్నంగా మలచడానికి ప్రయత్నించాను” అని తెలిపారు.
ప్రపంచ పాప్ కల్చర్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ ప్రపంచాల్లో ఒకటైన ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెజాన్ MGM స్టూడియోస్ నిర్మించిన ఈ భారీ చిత్రం జూన్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

