Skip to content

ఎస్‌.వి.కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌

ఎస్‌.వి.కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ Telugu News

దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు “వేదవ్యాస్” సినిమా మేకింగ్ వీడియో లాంఛ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ సభ్యులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ అధ్యక్షులు ప్రభు అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్‌కొండేటి ఎస్‌.వి.కృష్ణారెడ్డికి బొకేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు జనార్దన్, అబ్దుల్‌ జాయింట్‌ సెక్రటరీ శ్రీమతి పర్వీన్‌బాబి ఈసీ మెంబర్‌ గిరిధర్‌, అప్పాజీ, బాక్సాఫీస్‌ రమేష్‌, ఆర్‌.డి.ఎస్‌ ప్రకాష్‌ జిల్లాసురేష్‌లు పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.