Skip to content

హీరో సత్యదేవ్ “సమవర్తి” మూవీ నుంచి ‘బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి’ (మేకింగ్ ) రిలీజ్

హీరో సత్యదేవ్ “సమవర్తి” మూవీ నుంచి ‘బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి’ (మేకింగ్ ) రిలీజ్ Telugu News

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి “సమవర్తి” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. “సమవర్తి” సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్, స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “సమవర్తి” సినిమా నుంచి ‘బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి’ (మేకింగ్) రిలీజ్ చేశారు. విష సర్పాలు, క్రూర మృగాలు ఉన్న ప్రమాదకరమైన అడవుల్లో “సమవర్తి” షూటింగ్ ఎంత సాహసోపేతంగా చేశారో ఈ గ్లింప్స్ లో కనిపిస్తోంది. సౌతిండియాలోని 7 అరణ్య ప్రాంతాల్లో, ఇప్పటిదాకా ఎవరూ వెళ్లని 42 లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ చేయడం విశేషం. ‘సృష్టికైనా, వినాశనానికైనా ఒక పిలుపు రావాలి, ఒక పోరాటం పుట్టాలి, ఒక చిన్న యుద్ధం జరగాలి..’ అంటూ “సమవర్తి” కథలోని సంఘర్షణను తెలియజేశారు మేకర్స్. గ్లింప్స్ చివరలో ‘ఇక్కడ స్వర్గానికైనా చావే కావాలి తమ్ముడు..’ అనే హుక్ లైన్ ఆసక్తి కలిగిస్తోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన “సమవర్తి” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రత్యేకంగా ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది. ఈ చిత్రంతో సత్యదేవ్ పూర్తిగా కొత్త జోన్‌లోకి అడుగుపెడుతూ, ఫుల్-ఫ్లెడ్జ్డ్ యాక్షన్ స్పేస్ వైపు గేర్ మార్చారు.

నటీనటులు – సత్యదేవ్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
ఆర్ట్ డైరెక్టర్ – మొండ్రు రవికుమార్
కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రియాంక రెబెకా శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్ – ఉల్లాస్ హైదుర్
ఎడిటర్ – ఆదిత్య తివారి
డీవోపీ – హర్ష మల్లికార్జున, దేవ్ దీప్ గండికుండు
మ్యూజిక్ – సింజిత్ యెర్రమిల్లి
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – వినయ్ రెడ్డి మామిడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఉజ్వల్ బీఎం
ప్రొడ్యూసర్స్ – శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి
డైరెక్షన్ – అజయ్ నాగ్.వి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాక

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.