Skip to content

150 మిలియన్+ వ్యూస్ తో ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ ‘ఆయా షేర్’ సాంగ్

150 మిలియన్+ వ్యూస్ తో ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ ‘ఆయా షేర్’ సాంగ్ Telugu News

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ విజయాన్ని అందుకున్న ‘దసరా’ తర్వాత తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్ర సంగీత ప్రయాణానికి శ్రీకారం చుట్టిన తొలి సింగిల్ ‘ఆయా షేర్’ విడుదలైనప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తోంది.

తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్‌లోనే 150 మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ సాధించి నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియా, కాలేజ్ ఫెస్ట్స్, పబ్లిక్ ఈవెంట్స్, డ్యాన్స్ స్టేజీలను షేక్ చేస్తూ ఈ పాట ఒక కల్చరల్ ఫెనామెనన్‌గా మారింది.

శ్రీకాంత్ ఓదెల సృష్టించిన రఫ్ అండ్ రస్టిక్ ప్రపంచం, నాని పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఎర్తీ విజువల్స్, రగ్గడ్ టోన్, నాని మాస్ డ్యాన్స్ మూవ్స్ పాట ఇంపాక్ట్ ని మరింత పెంచాయి.

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జిటిక్ బీట్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లగా, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జంగిరెడ్డి, అర్జున్ చాందీ తమ డైనమిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్‌ను జోడించారు.

ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘ది ప్యారడైజ్’, ఇప్పటికే ‘ఆయా షేర్’తో కొత్త రికార్డులు సృష్టిస్తూ అంచనాలను పెంచింది . నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించబోతుంది

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.