Skip to content

‘వదలా’ నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ ‘ఆ నింగీ ఈ నేల’ సాంగ్ రిలీజ్

‘వదలా’ నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ ‘ఆ నింగీ ఈ నేల’ సాంగ్ రిలీజ్ Telugu News

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, థ్రిల్లింగ్ టీజర్‌ , టైటిల్ ట్రాక్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర బృందం ‘ఆ నింగీ ఈ నేల’ అనే అందమైన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ మెలోడీని విడుదల చేసింది.

మనసును హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ పాట కుటుంబ అనుబంధాలను ఎంతో అందంగా ఆవిష్కరిస్తోంది.

కృష్ణవేణి మల్లవజ్జల అందించిన సాహిత్యం పాటకు ప్రాణం పోయగా, కార్తీక్ కోడకండ్ల తన మధుర గానంతో మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. సంగీత దర్శకుడు కార్తీక్ బి. కోడకండ్ల స్వరపరిచిన ఈ మెలోడీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.

జగపతి బాబు, లయల మధ్య కనిపించే సహజమైన ఫ్యామిలీ కెమిస్ట్రీ ‘ఆ నింగీ ఈ నేల’ పాటకు మరింత భావోద్వేగాన్ని తీసుకొచ్చింది.

ఈ చిత్రానికి చోటా కె నాయుడు డీవోపీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్, లక్ష్మీ భూపాల రైటర్.

తారాగణం: జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: ఆకెళ్ల వి కృష్ణ
రచయిత: లక్ష్మీ భూపాల
నిర్మాతలు: కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ
DOP: చోటా కె నాయుడు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: కార్తీక్ కొడకండ్ల
ఆర్ట్ డైరెక్టర్: బజ్జా బ్రమయ్య
స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్
సాహిత్యం: కృష్ణవేణి మల్లవజ్జల, శివకృష్ణాచారి ఎర్రోజు, వీరు గడ్డం
ప్రొడక్షన్ కంట్రోలర్: బొడ్డు సత్యనారాయణ
పబ్లిసిటీ డిజైన్: కృష్ణా డిజిటల్
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.