క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ మే 28న…
ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల తన స్వగ్రామమైన వేదురుపాకను సందర్శించి, ఈ చిత్రాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలు, భావోద్వేగాలు, జాతర సంబరాలలో భాగమయ్యారు.
జాతర వేడుకల సందర్భంగా తన స్వగ్రామంలో ఇంటిని సందర్శించిన దేవిశ్రీ ప్రసాద్ గ్రామస్థులతో ఆప్యాయంగా ముచ్చటించి, వేడుకల ఉత్సాహంలో భాగమయ్యారు. ఈ సందర్భంగా అక్కడి జ్ఞాపకాలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే మనుసుని హత్తుకునే వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “మా నాన్నగారు జన్మించిన ఊరు వేదురుపాక. చిన్నప్పటి నుంచి ప్రకృతి, గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఎక్స్ పీరియన్స్ చేయాలని చెన్నై నుంచి తరచూ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారు. మా మూలాలతో, మనుషులతో అనుబంధం కొనసాగాలని ఇక్కడే ఒక అందమైన ఇల్లు కూడా నిర్మించుకున్నాం. సంస్కృతి, జానపద కళలు, దైవత్వం ఎంత అందమైనవో నాకు నేర్పిన ఊరు ఇదే. ఆ అనుభూతులే నేను ‘ఎల్లమ్మ’ సినిమా చేయడానికి స్ఫూర్తినిచ్చాయి” అన్నారు
దేవిశ్రీ ప్రసాద్ తన మూలాలతో ఉన్న అనుబంధాన్ని ఈ వీడియో అందంగా ఆవిష్కరించింది. అలాగే ‘ఎల్లమ్మ’ సినిమాలోని భావోద్వేగభరితమైన, సంస్కృతికి దగ్గరైన ప్రపంచాన్ని కూడా ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసింది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, వేణు యెల్దండి దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘ఎల్లమ్మ’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

