Skip to content

టాలీవుడ్‌లో ప్రత్యేకత చాటుకున్న ‘ఎం4ఎం’ మూవీ

టాలీవుడ్‌లో ప్రత్యేకత చాటుకున్న ‘ఎం4ఎం’ మూవీ Telugu News
టాలీవుడ్‌లో ప్రత్యేకత చాటుకున్న ‘ఎం4ఎం’ మూవీ Telugu News

▪️స‌క్సెస్‌ఫుల్‌గా థియేట‌ర్‌ల‌లో 2వ వారం
▪️ ప్రశంసలు అందుకుంటున్న జో శర్మ
▪️ త్వరలో ప్రముఖ OTTలో స్ట్రీమింగ్‌కు సిద్ధం

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ అంటేనే ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు రాని ఒక వినూత్నమైన ‘సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్’ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, అందరినీ ఆకట్టుకుంటోంది ‘ఎం4ఎం’ (Motive for Murder). గత వారం విడుదలైన ఈ చిత్రం రెండ‌వ వారం కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అంతేకాకుండా, IMDb, BookMyShow వంటి ప్లాట్‌ఫామ్‌లలో టాప్ రేటింగ్స్‌ను సొంతం చేసుకుంటోంది.

సరికొత్త కాన్సెప్ట్‌, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరిత కథనంతో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మోహ‌న్ మీడియా క్రియేష‌న్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. డెబ్యూ డైరెక్టర్‌గా ఆయన చూపించిన మేకింగ్ స్టైల్‌, సస్పెన్స్‌ను నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, “ప్రేక్షకులు సినిమా కాన్సెప్ట్‌ను, స్క్రీన్‌ప్లేను ఆదరిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది” అని తెలిపారు.

ఇక ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ‘రాధా’ పాత్రలో నటించిన అమెరికన్ నటి జో శర్మ తన తొలి తెలుగు చిత్రంతోనే విశేష ప్రశంసలు అందుకుంటోంది. భావోద్వేగాలు, ఉత్కంఠ, ధైర్యసాహసాలను సమపాళ్లలో ప్రదర్శిస్తూ ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ తన అనుభవంతో సినిమాకు మరింత బలం చేకూర్చారు.

డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్సాయి పెట్టై అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ప్రతి సన్నివేశంలోనూ థ్రిల్లింగ్ ఫీల్‌ను పెంచుతూ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసింది.

నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు… ప్రతి హత్య అనంతరం మృతదేహాలను ప్రసిద్ధ పెయింటింగ్స్ తరహాలో అమర్చే సీరియల్ కిల్లర్… అతడిని చేధించేందుకు ACP కృష్ణ, జర్నలిస్ట్ రాధా చేసే దర్యాప్తు… ఈ ఆసక్తికర అంశాలతో సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. “సీరియల్ కిల్లర్ ఎవరు?” అనే ప్రశ్నను మొదటి సన్నివేశం నుంచే ప్రేక్షకుల మనసుల్లో నాటుతూ క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌ను నిలబెట్టడం చిత్రానికి ప్రధాన బలంగా మారింది.

సస్పెన్స్, మిస్టరీ, సైకాలజికల్ ఎలిమెంట్స్ సమ్మేళనంగా రూపొందిన ‘ఎం4ఎం – Motive for Murder’ త్వరలోనే ఒక ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందని చిత్రయూనిట్ వెల్లడించింది.