Skip to content

న్యూ ఇయర్, హీరో బర్త్ డే సందర్భంగా ‘మన డాక్టర్ బాబే’ నుంచి శ్రీ స్కంద పోస్టర్, స్పెషల్ గ్లింప్స్ విడుదల

న్యూ ఇయర్, హీరో బర్త్ డే సందర్భంగా ‘మన డాక్టర్ బాబే’ నుంచి శ్రీ స్కంద పోస్టర్, స్పెషల్ గ్లింప్స్ విడుదల Telugu News

స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద శరణ్య, సుదీక్ష సమర్ఫణలో కృతాక్షి నిర్మిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. శ్రీ స్కంద హీరోగా ఈ మూవీని చలపతి కుమార్ పువ్వల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. న్యూ ఇయర్ స్పెషల్‌గా, హీరో పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. స్పెషల్ పోస్టర్‌తో పాటుగా, గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు.

హీరో శ్రీ స్కంద పుట్టిన రోజు సందర్భంగా న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్‌ని చూస్తుంటే మాత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని అర్థం అవుతోంది. చుట్టూ పచ్చదనం, ఆ ఊరి వాతావరణం, ఆ ఊరిలోని క్లినిక్.. అక్కడ పని చేసే డాక్టర్.. అని ఈ గ్లింప్స్‌లో చూపించారు. ఇక సినిమాలో కావాల్సినంత వినోదం ఉంటుందని ఈ గ్లింప్స్‌తోనే చెప్పేశారు. ‘మన డాక్టర్ బాబే’ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

ఈ చిత్రానికి మనోజ్ కుమార్ బుసం సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి కెమెరామెన్‌గా కిషోర్ బోయిడాపు, ఎడిటర్‌గా సెల్వ కుమార్ పని చేస్తున్నారు. ఇక రాంబాబు గోసాల, గిరిధర్ రాగోలు, విష్ణు యర్రావుల తదితరులు ఈ చిత్రంలోని పాటలకి సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసుకుని ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు.

తారాగణం : శ్రీ స్కంద, మోహన సిద్ధి, శృతి శంకర్, రాజీవ్ కనకాల, అలీ, శాంతి శ్రీనివాస్, కోటేశ్వరరావు, శ్రీనివాస్ పేరురెడ్డి, శివకుమార్ మట్టా, కంచి ఎలమంచిలి తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : స్కంద ఫిల్మ్స్
సమర్పణ : శరణ్య సుదీక్ష
నిర్మాత : వి.కృతాక్షి
దర్శకుడు : చలపతి పువ్వల
D.o.P : కిషోర్ బోయిడాపు
సంగీత దర్శకుడు: మనోజ్ కుమార్ బుసం
ఎడిటర్: సెల్వ కుమార్
రచయిత: రామకృష్ణ గరగ
కొరియోగ్రఫీ: గోపీ రాయ్
ఫైట్స్: దేవరాజ్ మాస్టర్
కో-డైరెక్టర్ : బాలాజీ రావూరి
సాహిత్యం : రాంబాబు గోసాల, గిరిధర్ రాగోలు, విష్ణు యర్రావుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ పేరురెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ : కంచి ఎలమంచిలి
పి.ఆర్.ఓ: సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.