Skip to content

నాగబంధం సెకండ్ సింగిల్ “సుర సుర” 19న రిలీజ్

నాగబంధం సెకండ్ సింగిల్ “సుర సుర” 19న రిలీజ్ Telugu News
నాగబంధం సెకండ్ సింగిల్ “సుర సుర” 19న రిలీజ్ Telugu News
నాగబంధం సెకండ్ సింగిల్ “సుర సుర” 19న రిలీజ్ Telugu News
నాగబంధం సెకండ్ సింగిల్ “సుర సుర” 19న రిలీజ్ Telugu News

దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’, విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కృతిక అంశాలు వున్నాయి. చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్, “సుర సుర” (తెలుగు)ను ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌కు లభించిన అద్భుతమైన  స్పందనతో ఈ చిత్రంపై  ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి.

‘సుర సుర’ పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. భారీ సెట్స్‌, గ్రాండ్ విజువల్స్‌, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో ఈ పాట సినిమా లో ఒక మెయిన్ హైలెట్ గా నిలవనుంది.

ఈ పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్, అభే అందించగా, ఫోక్ ఎలిమెంట్స్‌ను సినిమాటిక్ ఆర్కెస్ట్రేషన్‌తో కలిపి ఫెస్టివ్ సాంగ్‌గా తీర్చిదిద్దారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత జోష్ తీసుకురానుంది.

అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ వంటి గాయకులు ఈ పాటకు వోకల్స్ అందించారు. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం వేడుకలు, సంప్రదాయం, కలిసికట్టుగా ఉండే ఆనందాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, భక్తి గీతం ‘నమో రే’ ప్రేక్షకులను ఆకట్టుకుని చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు ‘సుర సుర’ పాటతో ఫెస్టివ్ వైబ్‌ను ఈ సినిమా అందించనుంది.

నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగి రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు.

See also  అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ ‘శ్రీనివాస మంగాపురం’ తిరుపతిలో మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.