రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ ‘పెద్ది’ గ్లింప్స్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది' మేకర్స్ బర్త్ డే, శ్రీరామ నవమిని పురస్కరించుకుని అభిమానులకు ఒక పవర్‌ఫుల్ కానుకను అందించారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న 'పెద్ది' పెహల్వాన్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట’ అనే పవర్ ఫుల్ వాయిస్ తో గ్లింప్స్ మొదలౌతుంది. ఆ తర్వాత విజువల్స్ ఆడియన్స్ ని కుస్తీ పోటీలోకి తీసుకువెళ్తాయి. అక్కడ దుమ్ము,…
