‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ఫిబ్రవరి 24న రిలీజ్
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన పాన్ వరల్డ్ సినిమా 'ది ప్యారడైజ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ కాన్వాస్ పై నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు, మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వేడుకలకు టీమ్ సిద్ధమవుతోంది. అదే రోజున చిత్రంలోని ఫస్ట్ సింగిల్ “ఆయా షేర్”ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గూస్‌బంప్స్ తెప్పించే ఈ ఇంట్రడక్షన్ ట్రాక్‌తో సినిమా ప్రమోషన్స్‌కు ఘనమైన ఆరంభం ఇవ్వబోతున్నారు మేకర్స్. ఈ పాటను వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో చిత్రీకరించారు…
