Skip to content

‘శంబాల’.. విడుదలకు సిద్దం

యంగ్ హీరో, వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ ప్రస్తుతం ‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రంతో అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ మూవీ టీజర్ అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే. శంబాల టీం వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, మేకింగ్ వీడియో ఇలా అన్నీ కూడా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాయి. ఇక తాజాగా నిర్వహించిన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) కార్యక్రమంలో ‘శంబాల’ టీజర్ హాట్ టాపిక్‌గా మారింది. విదేశాలలో తెలుగు సంస్కృతి, సినిమా సెలెబ్రేట్ చేసే ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటైన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2025 కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులంతా సందడి చేశారు. ఈ క్రమంలో…

Read more

“మై బేబి” సినిమా గొప్ప సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాం – నిర్మాత సురేష్ కొండేటి

నిమిషా సాజయాన్ హీరో హీరోయిన్లు గా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ "డీఎన్ఏ"ను "మై బేబి" పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి. ఆయన యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ తో కలిసి తన ఎస్ కే పిక్చర్స్ పై "మై బేబి" చిత్రాన్ని ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ కొండేటి నిర్మాతగా, దుప్పాడిగట్టు సారిక రెడ్డి, పి.సాయిచరణ్ తేజ కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛ్ చేశారు. ఈ…

Read more

‘పరదా’ ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది: హీరో సత్యదేవ్

-అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, ప్రవీణ్ కాండ్రేగుల, విజయ్ డొంకడ, ఆనంద మీడియా 'పరదా' ఆగస్టు 22న థియేట్రికల్ రిలీజ్, యత్ర నార్యస్తు సాంగ్ లాంచ్ సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. రాజ్ ఇటీవల 'శుభం' సినిమాతో సమంతతో కలిసి బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ కూడా ఈ చిత్రంలో కీలక…

Read more

‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్ రిలీజ్

వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, వెరీ ట్యాలెంటెడ్ నిత్యా మేనన్‌ జంటగా నటిస్తున్న రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. "A Rugged Love Story" అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదిదలైన ‘సార్‌ మేడమ్‌’ టీజర్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ''నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా' అని విజయ్ సేతుపతి డైలాగ్ తో మొదలైన ట్రైలర్…

Read more

‘హరి హర వీరమల్లు’ అద్భుతంగా ఉంటుంది: నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై…

Read more

‘జూనియర్‌’ సినిమా ఫస్ట్ డే చూడాలన్న ఇంట్రస్ట్ ని క్రియేట్ చేసింది. కిరీటీ బెస్ట్ కాంప్లీమెంట్స్ అందుకున్నాడు. పైసా వసూల్ మూవీ ఇది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. అందరికి…

Read more

*యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతున్న విజయ్ దేవరకొండ “కింగ్డమ్”

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "కింగ్డమ్" యూఎస్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందుగానే యూఎస్ లోని 64 లొకేషన్స్ లో 135 షోస్ కు భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటిదాకా "కింగ్డమ్" మూవీకి 15 కె ( 13.63 లక్షల రూపాయల) టికెట్ సేల్స్ జరిగాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ కూడా చేయకముందే, ఏ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ తో ప్రమోషన్ జరపకముందే "కింగ్డమ్" సినిమాకు ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఈ మూవీ మీద ఉన్న క్రేజ్ ను చూపిస్తోంది. "కింగ్డమ్" టీజర్ రిలీజైనప్పటి నుంచే ఈ మూవీ మీద అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి…

Read more

హీరోయిన్‌ సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

మనం చేసిన మంచి పనిని గుర్తించటమే కాకుండా ఆ పనికి అవార్డులు రివార్డులు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది...ప్రస్తుతం అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఫేమస్‌ తమిళ, కన్నడ, తెలుగు నటి సంచితా శెట్టి. సంచితా విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘సూదుకవ్వుమ్‌’, ఆశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించిన ‘విల్లా’తో పాటు ప్రభుదేవా హీరోగా ‘భగీరా’ చిత్రాలతో పాటు దాదాపు 25 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. నటనతో పాటు సంచిత చేసిన యూత్‌ లీడర్‌ షిప్‌ సేవలను దృష్టిలో ఉంచుకుని సెయింట్‌ మథర్‌ థెరిసా యూనివర్సిటీవారు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. కోయంబత్తుర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సంచితకు ఈ అవార్డును అందచేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఇకపై మరిన్ని మంచి పనులు…

Read more

‘కింగ్‌డమ్’ చిత్రం నుంచి ‘అన్న అంటేనే’ గీతం విడుదల

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కింగ్‌డమ్'. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న 'కింగ్‌డమ్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, 'హృదయం లోపల' గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతం 'అన్న అంటేనే' విడుదలైంది. 'కింగ్‌డమ్' నుంచి 'అన్న అంటేనే' గీతాన్ని బుధవారం(జూలై 16) సాయంత్రం విడుదల చేశారు నిర్మాతలు. ఉత్సాహవంతమైన గీతాలతో అందరినీ ఉర్రుతలూగిస్తున్న అనిరుధ్ రవిచందర్.. 'కింగ్‌డమ్' కోసం ఈ…

Read more