#RAPO23 చిత్రానికి సామ్ సిఎస్ మ్యూజిక్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఖైదీ, పుష్ప 2, మహా అవతార్ నరసింహ వంటి చిత్రాలకు అదిరిపోయే సౌండ్ ట్రాక్స్ అందించిన సామ్ సిఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. #RAPO23లో సామ్ సిఎస్ చేరడంతో మ్యూజికల్ కూడా ఈ చిత్రం భారీ అంచనాలని నెలకొల్పింది. #RAPO23లో మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో…
