Skip to content

శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 28న రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్సయిటింగ్ ఎంటర్‌టైనర్‌ 'విష్ణు విన్యాసం'తో థియేటర్లలో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. శ్రీ విష్ణు ఫంకీ ప్రింటెడ్ షార్ట్స్, కలర్ ఫుల్ చొక్కా, షేడ్స్ ధరించిన క్లాసిక్ బైక్‌పై విశ్రాంతి తీసుకుంటున్నట్లు అదిరిపోయే వైబ్ తో కనిపించిన అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది. విష్ణు విన్యాసం ఫన్, కలర్ ఫుల్ సినిమాటిక్ రైడ్‌ గా ఉండబోతోంది. శ్రీవిష్ణు విచిత్రమైన నమ్మకాలు, జాతకాలని నమ్మే యువకుడి పాత్రలో అలరించబోతున్నారు ప్రమోషన్‌లు ఇప్పటికే జోరందుకున్నాయి,…

Read more

సమంత లాంచ్ చేసిన ‘సరస్వతి’ ఫస్ట్ లుక్

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. తాజాగా హీరోయిన్ సమంత ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తెల్లని క్రాక్ టెక్స్చర్ బ్యాక్‌డ్రాప్ మధ్యలో ఎరుపు చీరలో ధైర్యంగా నడుస్తున్న రలక్ష్మి శరత్ కుమార్ కథలోని బలం-భావోద్వేగాలను హైలైట్ చేసినట్టుగా కనిపిస్తోంది. వెనుక భాగంలో బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌లో కనిపించే పాత్రల సిల్హౌట్స్ కథలోని ఇంటెన్స్ సూచిస్తున్నాయి. స్ట్రాంగ్ విజువల్ ఎలిమెంట్స్‌తో…

Read more

నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్ రిలీజ్

విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'నాగబంధం'. ఈ చిత్రం పాన్-ఇండియాలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో టీం ప్రమోషన్‌లను ముమ్మరం చేసింది. ఫస్ట్-లుక్ పోస్టర్లు ఇప్పటికే సంచలనాన్ని సృష్టించాయి. ఈ చిత్ర టీజర్‌ను రేపు మహా శివరాత్రి శుభ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు. టీజర్ మీడియా ప్రీమియర్ ఇప్పటికే జరిగింది. విజువల్స్, స్టొరీ టెల్లింగ్, వరల్డ్ బిల్డింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ రోజు మేకర్స్, KGF ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ ఆయన పాత్ర బైరాగిని పరిచయం చేశారు. బూడిదతో అలంకరించిన శరీరం, జటలతో కూడిన ఆతన లుక్ మిస్టికల్ టచ్ ఇచ్చింది…

Read more

“కపుల్ ఫ్రెండ్లీ” సినిమాకు ప్రభాస్ ప్రశంస

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. తనకు వర్షం సినిమాలా, సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ గుర్తుండిపోయే మూవీ అవుతుందని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదొక లవ్ లీ బ్యూటిఫుల్ ఫిలిం అని, ఈ చిత్రాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేశానంటూ ప్రభాస్ తెలిపారు. సంతోష్, మానస జోడీ అద్భుతంగా ఉందని, అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారని ప్రభాస్ ప్రశంసించారు. ఇలాంటి మంచి కథలను తెరపైకి తీసుకొచ్చిన కో ప్రొడ్యూసర్ అజయ్, యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు…

Read more

ప్రభాస్ గారు ప్రశంసించడం నేను గెలిచాననే ఫీల్ కలిగించింది – సంతోష్ శోభన్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. "కపుల్ ఫ్రెండ్లీ" సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు. "కపుల్ ఫ్రెండ్లీ" సక్సెస్ సాధించిన నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్ గోకుల్ థియేటర్ లో ప్రేక్షకుల సమక్షంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు…

Read more

‘బ్యాండ్ మేళం’ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. డైరెక్టర్ బాబీ

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. ఈ మూవీని మార్చి 13న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ని వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ గ్లింప్స్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌‌కి దర్శకుడు బాబీ, రచయిత బీవీఎస్ రవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్‌ని వాలెంటైన్స్…

Read more

పురుష నుంచి చాటు చాటు సాంగ్ రిలీజ్

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త సినిమా ‘పురుష:’. పక్కా ఫ్యామిలీ కథతో వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో ‘పురుష:’ సినిమా రాబోతోంది. వీరు వులవల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నారు. హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు ఆడియన్స్ దృష్టిని ఆకర్షించగా.. రీసెంట్ గా వదిలిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ కంటెంట్ వదులుతూ తమ మూవీపై అంచనాలు క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా పురుష:…

Read more

ఆకట్టుకుంటున్న ‘ఏమో ఏమో ఇది’ గ్లింప్స్

శైలేష్ కొలను, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో నూతన చిత్రం 2026 దసరా కానుకగా చిత్రo విడుదల రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల దర్శకుడు డా. శైలేష్ కొలను, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సరికొత్త రొమాంటిక్ కామెడీ సినిమా కోసం చేతులు కలిపారు. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ అనే అందమైన టైటిల్ ను ఖరారు చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను ఆవిష్కరించారు. “ఏమో ఏమో ఇది” అనే టైటిల్ వినగానే ఉల్లాసమైన ప్రేమ భావనలు మనసులో మెదులుతున్నాయి. చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన…

Read more

హే భగవాన్‌ నవ్విస్తుంది.. హృదయానికి హత్తుకుంటుంది: సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిర్మాత వంశీ నందిపాటి విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి. 'హేభగవాన్‌' ఎలాంటి సినిమా?…

Read more

“క్వీన్” టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. ఆయన గతంలో రూపొందించిన ఉత్తర, ఆర్టిస్ట్ మూవీస్ మంచి ఫిలింమేకర్ గా పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తన మూడో చిత్రంగా యామినీ ఈఆర్ తో హీరోయిన్ సెంట్రిక్ కథతో "క్వీన్" సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది‌. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం 90's హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా "క్వీన్" సినిమా టైటిల్…

Read more