రవితేజ “మిరపకాయ్” జులై 11న రీ రిలీజ్
మాస్ మహారాజ రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్టూ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. రవితేజ హీరోగా ఎల్లో ప్లవర్స్ బ్యానర్ పై నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించిన చిత్రం ‘మిరపకాయ్’. 2011 సంక్రాంతికి విడుదలై మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా, ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్, ట్రైలర్ కు అభిమానుల నుండి అలాగే సినీ ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జులై 11న ‘మిరపకాయ్’…