Skip to content

*’టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు’ అంటూ “వర్జిన్ బాయ్స్” ట్రైలర్ లాంచ్ – జూలై 11న థియేటర్లలో విడుదల*

రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్ పై దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈరోజు మీడియా సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అంగరంగ వైభవంగా వర్జిన్ బాయ్స్ చిత్ర ట్రైలర్…

Read more

పైరసీని అరికట్టిన డీసీపీ కవిత బృందాన్ని అభినందించిన ప్రేమిస్తున్నా చిత్ర యూనిట్ !!!

ఎప్పటినుండో సినీ పరిశ్రమను భూతంలో పట్టి పీడిస్తున్నది పైరసీ. ఈ పైరసీని అరికట్టే ప్రయత్నంలో డీసీపీ కవిత అండ్ టీమ్ అనేక సినిమాల పైరసీకి పాల్పడిన నేరస్తుడిని పట్టుకొని సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసారు. ఈ సందర్భంగా ఐబిఎమ్ ప్రొడక్షన్స్ ప్రేమిస్తున్నా చిత్ర బృందం ప్రేత్యేకంగా కలిసి అభినందించారు. భవిషత్తులో కూడా ఇలాంటి పైరసీ సైబర్ నేరస్తుల నుండి సినిమా పరిశ్రమని రక్షించమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రేమిస్తున్నా చిత్ర నిర్మాత పప్పుల కనకదుర్గారావు దర్శకుడు భాను నిర్వాహకులు మర్రి రవికుమార్, హీరో సాత్విక్ వర్మ, హీరోయిన్ ప్రీతి నేహా, ఎడిటర్ శిరీష్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ... "పైరసీ మహమ్మారి వలన చిత్ర నిర్మాతలు…

Read more

కలల్ని నిజం చేసుకోవడానికి కష్టపడుతున్నా -సూర రాజేశ్వరరావు

తెలుగు డిజిటల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు ఒక పేరు బాగా వినిపిస్తోంది. ఎన్నో అంచనాలు, ఎన్నో ఆశలతో ప్రకాశిస్తున్న ఆ యువకుడే సూర రాజేశ్వర రావు. సాధారణంగా, తెరపై కనిపించే వారికి ఒక బలమైన నేపథ్యం ఉంటుంది. కానీ, రాజేష్ ప్రస్థానం అందుకు పూర్తి భిన్నం. కిందటి తరం కష్టాలను చూస్తూ, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కన్న కలలు, ఆ కలలను నిజం చేసుకోవడానికి చేసిన నిరంతర కృషి... ఇవన్నీ అతన్ని నేడు తెలుగు డిజిటల్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ యాంకర్‌గా నిలబెట్టాయి. మరి, ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అతని బిగ్ బాస్ కల వెనుక ఉన్న కథేంటి? తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం, కింతలి…

Read more

మై బేబి ఈనెల 11న విడుదల

ఇటీవల విడుదలై తమిళంలో సూపర్ హిట్ అయిన డి ఎన్ ఏ సినిమాను ఎస్. కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో జూలై 11న విడుదల కానుంది. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ 'షాపింగ్ మాల్ ' 'పిజ్జా' వంటి విజయవంతమైన 15 చిత్రాలను నిర్మాతగా విడుదల చేసిన సురేష్ కొండేటి గతంలో డిస్ట్రిబ్యూటర్ గా 85 పైగా చిత్రాలను విడుదల చేశారు. ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ‘మై బేబి’ ప్రోడ్యూసర్ గా తనకు తెలుగులో 16వ చిత్రమని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్సన్ వెంకటేసన్…

Read more

మిస్టీరియస్” టీజర్‌ లాంచ్

ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మరియు శివాని నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ఘనంగా లాంచ్ చేసింది మూవీ టీమ్ ఈ సందర్భంగా డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘’సస్పెన్స్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ,తాజాగా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని’’ చెప్పుకొచ్చారు. ఇక నిర్మాతలు ఉషా మరియు శివాని మాట్లాడుతూ…

Read more

“666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్” చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్ విడుదల !!!

సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు హేమంత్ రావు, తాజాగా "666 ఆప‌రేష‌న్ డ్రీమ్ థియేట‌ర్" అనే టైటిల్‌తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు, ఈ చిత్రంలో పుష్ప చిత్రంలో అల‌రించిన న‌టుడు డాలీ ధ‌నుంజ‌య న‌టిస్తుండగా.. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి డాలీ ధనుంజయ్ న్యూ లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. డిఫరెంట్ గా మ్యాన్ లీ లుక్ లో ఉన్న ధనుంజయ్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పుష్ప 1,2…

Read more

ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ జూలై 25న విడుదల

1960ల నాటి MCU కాలక్రమంలో రీడ్ రిచర్డ్స్ మరియు అతని సహచరుడిని చూడటానికి అభిమానులు సిద్ధమవుతున్నారు, ఈ కొత్త సినిమా ప్రయాణం కోసం వారి శక్తులు ఎలా అభివృద్ధి చెందాయో చూడటం ఉత్సాహంగా ఉంటుంది. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ ఫెంటాస్టిక్ ఫోర్ నాయకుడు, రీడ్ రిచర్డ్స్ తన శరీరాన్ని తిరిగి ఆకృతి చేయడానికి తన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఈ వెర్షన్ ఒక కొత్త మలుపును పరిచయం చేస్తుంది: రీడ్ రబ్బరు లాగా ఉండడమే కాకుండా, అతను స్థలాన్ని కూడా తారుమారు చేస్తాడు, దాదాపు అపరిమిత స్థితిస్థాపకతను అనుమతిస్తాడు. అతని మానవాతీత తెలివితేటలతో కలిపి, అతను MCU యొక్క అత్యంత బలీయమైన శాస్త్రీయ మనస్సులలో ఒకరిగా…

Read more

‘రామాయణ: ది ఇంట్రడక్షన్’ రిలీజ్

5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా 'రామాయణ' రెండు భాగాల లైవ్-ఆక్షన్ సినిమాటిక్ యూనివర్స్‌గా, ఇప్పటివరకు రూపొందిన అతి పెద్ద టెంట్‌పోల్ సినిమాల స్థాయిని రీఇమాజిన్ చేయనుంది. ఈ చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అందుకున్న VFX స్టూడియో DNEG సంయుక్తంగా, యాష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్న రామాయణ, IMAX కోసం చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రం పార్ట్ 1 – దీపావళి…

Read more

‘కూలీ’ నుంచి దహాగా అమీర్‌ఖాన్‌ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు మేకర్స్ అమీర్‌ఖాన్‌ ని దహాగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం వున్న గ్లాసెస్ ధరించి సిగార్ తాగుతూ అమీర్‌ఖాన్‌ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

Read more

ఈసారి డేట్ మారదు.. ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' ట్రైలర్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా కనువిందు చేయనున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో…

Read more