తెలుసు కదా నుంచి సొగసు చూడతరమా లాంచ్
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెలుసు కదా ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇది సిద్దూ, రాశీ ఖన్నా అలరించిన క్లాసిక్ లవ్ నంబర్. ఈ రోజు సిద్దు, శ్రీనిధి శెట్టి నటించిన సెకండ్ సింగిల్ సొగసు చూడతరమా సాంగ్ ను హీరోయిన్ నయనతార లాంచ్ చేశారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మించిన ఈ చిత్రానికి S థమన్ సంగీతం అందించారు. సాయంత్రం ముగిసే సమయానికి సిద్ధూ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, శ్రీనిధి తన వాచ్ సమయాన్ని రీసెట్ చేస్తుంది, ఆమె…
