త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది .. దర్శకుడు మోహన్ శ్రీవత్స
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ సినిమాకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ ఆగస్ట్ 29న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. ఈ మేరకు దర్శకుడు మోహన్ శ్రీవత్స చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే.. ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఇంతకు ముందు ఏం నేర్చుకున్నారు? నేను సంగీతాన్ని నేర్చుకున్నా కూడా.…
