మాతృదేవోభవ ఆశ్రమాన్ని సందర్శించి మానవత్వం చాటిన మనోజ్ మంచు
‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’లో భాగంగా రా కింగ్ మనోజ్ మంచు మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని సందర్శించారు. అనాథ, మానసిక స్థితి సరిగ్గా లేని సంతోష్ అనే యువకుడి పునరావాసానికి వ్యక్తిగతంగా సహాయం చేశారు. ఈ క్రమంలో మనోజ్ వ్యక్తిగతంగా సంతోష్‌కు హెయిర్ కట్ చేయడమే కాకుండా.. కొత్త బట్టల్ని కూడా అందించారు. అతి తక్కువ సమయంలో సంతోష్‌ని సాధారణ మనిషిలా మార్చేశారు. పూర్తి మేకోవర్ తర్వాత అతడిని చూసి మనోజ్ ఆప్యాయంగా నవ్వి "సంతోష్ భాయ్, మీరు హీరోలా అయిపోయారు, సంతోష్ భాయ్" అని అన్నారు. ఈ కొత్త చొక్కా నచ్చిందా అని ఇంకా అడిగి ఆప్యాయంగా మనోజ్ పలకరించారు. ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ .. ‘మాతృదేవోభవ అనాధ ఆశ్రమం…
