Skip to content

‘ది ప్యారడైజ్’ టీజర్ 6న రిలీజ్

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ‘పాన్-వరల్డ్’ చిత్రం ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన లభించింది. పోస్టర్, టైటిల్ గ్లింప్స్‌తో పాటు, చిత్రంలోని మొదటి పాట ‘ఆయా షేర్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు శ్రీకాంత్ ఒడెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో, ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. SLV సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో సినిమాపై నెలకొన్న ఆసక్తి మరింత పెరిగింది. 1 నిమిషం 35 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో సినిమా వరల్డ్ తో పాటు కథలోని ఎమోషనల్ ఇంటెన్సిటీని చూపించబోతున్నారు. మేకర్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాని రగ్గడ్ లుక్, రా విజువల్ వరల్డ్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల యూనిక్ స్టయిల్… ఇవన్నీ కలిసి ‘ది ప్యారడైజ్’ పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

ఈ చిత్రంలో మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నటీనటులు: నాని, మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.