వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!
టాలీవుడ్‌లో యువ తరం హీరోయిన్లలో ఒక ప్రకాశవంతమైన స్టార్ గా ఎదుగుతున్న నయన్ సారిక ప్రస్తుతం హాట్ ట్రెండింగ్ స్టార్‌గా మారింది. అందం, నటనా ప్రతిభ, సహజత్వంతో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ యంగ్ ఆర్టిస్ట్ వరుస సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతోంది. ‘గం గం గణేశా’తో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నయన్ సారిక, తర్వాత వచ్చిన ‘క’, ‘ఆయ్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాల్లో ఆమె ప్రదర్శించిన సహజ నటన, పల్లెటూరి అమ్మాయి లుక్, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి. ముఖ్యంగా ‘ఆయ్’లో ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ యూత్ లో భారీ క్రేజ్ సృష్టించింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా…
