Skip to content

#KJQ చాలా డిఫరెంట్ సినిమా.. ఆడియన్స్ ని ఖచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది: హీరో దీక్షిత్ శెట్టి

  • #KJQ మంచి కంటెంట్ ఉన్న యూనిక్ సినిమా. ఎమోషన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి: హీరో శశి ఓదెల

సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా #KJQ (కింగ్ – జాకీ – క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ‘దసరా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KK(కిరణ్ )కి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ: తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను చేసిన ప్రతి సినిమాను మీరు ఎంతగానో ఆదరించారు. ఈ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఒక ఎక్సైట్మెంట్, ఒక భయం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా బాధగా ఉంది. సినిమా విడుదల సమయంలో దర్శకుడు మన మధ్య లేకపోవడం… సినిమా తండ్రి లేని కొడుకులా అనిపిస్తోంది. సినిమా గురించి ఏదైనా అడగాలన్నా, ఏదైనా తెలుసుకోవాలన్నా ఎవరిని అడగాలనే ప్రశ్న మా టీమ్ అందరిలో ఉంది. అయితే శ్రీకాంత్ గారు, నిర్మాత సుధాకర్ గారు మాకు అండగా నిలబడ్డారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఆగస్టు 7న విడుదల అవుతోంది. తప్పకుండా థియేటర్‌లో చూసి ఆదరించండి. ‘దసరా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలకు ఎలా సపోర్ట్ చేశారో, ఈ సినిమాకూ అదే ప్రేమ చూపిస్తారని నమ్ముతున్నాను. ఈసారి కూడా మిమ్మల్ని నిరాశపరచను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కింగ్, జాకీ, క్వీన్ పాత్రలు మీకు గుర్తుండిపోతాయి. తప్పకుండా ఆగస్టు 7న థియేటర్‌లో చూసి ఆశీర్వదించండి. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది. అందరికీ థ్యాంక్యూ సో మచ్.

హీరో శశి మాట్లాడుతూ: “#KJQ చాలా మంచి సినిమా. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే చిత్రమిది. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది. డెఫినెట్‌గా థియేటర్‌లో చూసి మీ హానెస్ట్ ఒపీనియన్ చెప్పండి. కిరణ్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన విజన్‌ను తెరపైకి తీసుకురావడానికి మేమంతా ఎంతో ప్యాషన్‌తో పనిచేశాం. ఈ సినిమాను తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా చూస్తున్నంతసేపూ మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులోని ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. మంచి కంటెంట్ ఉన్న సినిమా.”

హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ: మా సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ. కిరణ్ గారు చాలా పెద్ద విజన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. రిలీజ్ సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కానీ #KJQ లాంటి ఒక మాస్టర్‌పీస్‌ను మనకు ఇచ్చి వెళ్లారు. నా కెరీర్‌లో ఇది చాలా మెమొరబుల్ క్యారెక్టర్. ఇందులో నా పాత్రకు చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక నటిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఆగస్టు 7న సినిమా విడుదల అవుతోంది. తప్పకుండా థియేటర్‌లో చూసి ఆదరించండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.”

ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ: ఈ సినిమా స్క్రిప్ట్ స్టేజ్ నుంచే నేను ఈ ప్రాజెక్ట్‌తో ఉన్నాను. కిరణ్ మనందరినీ విడిచి వెళ్లిపోవడం చాలా బాధాకరం. నిజంగా ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. కిరణ్ ఉంటే ఎలా చేసేవారో, ఆయన విజన్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తీర్చిదిద్దడానికి మేమంతా ప్రయత్నించాం. చివరి క్షణం వరకు కూడా ఆయన సినిమా గురించే ఆలోచించారు. ఆయన కలను నిజం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో శ్రద్ధగా రూపొందించాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది.

నటీనటులు: దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా

సాంకేతిక బృందం:
బ్యానర్ – SLV సినిమాస్
నిర్మాత – సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం – KK
సినిమాటోగ్రఫీ – నాగేశ్ బనెల్
సంగీతం – పూర్ణచంద్ర తేజస్వి
ఎడిటర్ – శ్రవణ్ కటికనేని
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీకాంత్ రామిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శేఖర్ యలమంచిలి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.