Skip to content

“పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ” మోషన్ పోస్టర్ విడుదల 

“పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ”  మోషన్ పోస్టర్ విడుదల  Telugu News
“పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ” మోషన్ పోస్టర్ విడుదల  Telugu News
“పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ” మోషన్ పోస్టర్ విడుదల  Telugu News

కొలచెల డ్రీమ్ వర్క్స్ పతాకంపై యతింద్ర మరియు రమ్య దినేష్ హీరో హీరోయిన్ గా ఏ ఫణీంద్ర దర్శకత్వంలో సురేఖ కొలచెల నిర్మిస్తున్న కామెడీ డ్రామా చిత్రం “పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ”. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ను శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పలువురు ప్రముఖ దర్శకులు లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ “”పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ” ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ చిత్రం. కేవలం ఒక రాత్రి సమయంలో ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగే కథ. మా చిత్ర హీరో యతీంద్ర ఒక విభిన్నమైన బ్రాహ్మణ గెట్ అప్ లో కనిపిస్తారు. రేపు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా మా చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తున్నాం.

మా చిత్రం ఏప్రిల్ 15 తర్వాత అమలాపురం మరియు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాం” అని తెలిపారు.

నటి నటులు: యతింద్ర, రమ్య దినేష్ మరియు తదితరులు

చిత్రం పేరు: పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ
బ్యానర్: కొలచెల డ్రీమ్ వర్క్స్
దర్శకుడు: ఏ ఫణీంద్ర
నిర్మాత: సురేఖ కొలచెల
సినిమాటోగ్రాఫర్: సురేష్ రగుటు
సంగీతం: అవినాష్ కురుమానా
ఎడిటర్: ప్రశాంత్ తేజ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ తమ్మినేని
మార్కెటింగ్: వంశీ కృష్ణ (సినీ డిజిటల్)

See also  పెద్ది మూవీకి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాత వెంకట సతీష్ కిలారు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.