Skip to content

‘పురుష:’ నుంచి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి పాడిన ‘జాలి పడేదెవ్వడు’ పాట విడుదల

భార్యాభర్తల తగువులు, గిల్లికజ్జాలు, సంసారం చుట్టూ అల్లే కథలు ఎప్పటికీ ఆడియెన్స్‌కి బోర్ కొట్టవు. ఇక ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. కేవలం పోస్టర్లు, ఫస్ట్ లుక్స్‌తోనే జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన మేకర్స్.. రీసెంట్‌గా టీజర్‌తో అందరినీ తెగ నవ్వించేశారు.

ఇక తాజాగా ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ అన్నట్టుగా.. మగాడి మీద జాలి కలిగేలా, మగాడి పరిస్థితిపై సానుభూతి పెరిగేలా ‘జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను ఎం. ఎం. కీరవాణి అద్భుతంగా ఆలపించారు. ఇక శ్రవణ్ భరద్వాజ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అయితే సినిమా కథను వివరించేలా, కథనాన్ని అందరికీ ముందే చెప్పినట్టుగా ఉన్నాయి. ఎంతో ఫన్నీగా సాగిన ఈ లిరిక్స్ భార్యాభర్తల మధ్య బంధాన్ని వివరించాయి.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నటీనటులు : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు.

సాంకేతిక బృందం

బ్యానర్ : కళ్యాణ్ ప్రొడక్షన్స్
నిర్మాత : బత్తుల కోటేశ్వరరావు
దర్శకుడు : వీరు వులవల
సంగీత దర్శకుడు : శ్రవణ్ భరద్వాజ్
కెమెరామెన్ : సతీష్ ముత్యాల
ఎడిటర్ : కోటి
ఆర్ట్ : రవిబాబు దొండపాటి
లిరిక్స్ : అనంత శ్రీరామ్
పీఆర్వో : సాయి సతీష్