Skip to content

‘రాకాస’ నుంచి ఆకట్టుకునే ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే పాట విడుదల

‘రాకాస’ నుంచి ఆకట్టుకునే ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే పాట విడుదల Telugu News
‘రాకాస’ నుంచి ఆకట్టుకునే ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే పాట విడుదల Telugu News

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ క్రమంలో రిలీజ్ చేసిన ‘రాకాస’ గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంత వరకు చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ఇక ఈ టీం మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది. ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే ఈ పాట ఎంతో చక్కగా ఉంది. హీరోయిన్ పట్ల హీరోకి ఉన్న ప్రేమ, తనకి బదులుగా వేరే వాడ్ని పెళ్లి చేసుకుంటోన్న తరుణంలో హీరోయిన్ గురించి హీరో చెప్పడం, తన బాధను వివరించడం ఈ పాటలో కనిపిస్తోంది. ఆ బాధని కూడా ట్రెండీ పదాలతో, చాలా ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారు.
అనుదీప్ దేవ్ అందించిన బాణీ, రఘురాం సాహిత్యం, రామ్ మిర్యాల గాత్రం ఈ పాటను మరింత స్పెషల్‌గా మార్చేశాయి. ప్రస్తుతం ఈ పాట మ్యూజికల్ లవర్స్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫర్‌గా, ఎడిట‌ర్‌‌గా అన్వ‌ర్ అలీ పని చేశారు.
ఈ మూవీ ఆడియో హక్కుల్ని సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
న‌టీన‌టులు: సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌, అమ‌న్‌, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్స్: జీ స్టూడియోస్‌, పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌ l నిర్మాత‌లు: నిహారిక కొణిదెల‌, ఉమేష్‌కుమార్ బన్సాల్‌ l క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం: మాన‌స శ‌ర్మ‌ l ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: మ‌న్యం ర‌మేష్‌ l ఆడిష‌న్ స్క్రీన్ ప్లే: మ‌హేష్ ఉప్పాల‌ l సంగీతం: అనుదీప్ దేవ్‌ l సినిమాటోగ్రాఫ‌ర్‌: రాజు ఎదురోలు l యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌: విజ‌య్‌ l ఎడిట‌ర్‌: అన్వ‌ర్ అలీ l ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రామాంజ‌నేయులు l ఆర్ట్ డైరెక్ట‌ర్‌: పుల్ల విష్ణు వ‌ర్ధ‌న్‌ l కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: సంధ్య సబ్బ‌వ‌ర‌పు l పి.ఆర్.ఒ: ఎస్‌.కె.నాయుడు-ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా) l ఈవెంట్ పార్ట్‌న‌ర్‌: యు వుయ్ మీడియా l మార్కెటింగ్‌: టికెట్ ఫ్యాక్ట‌రీ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.