మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'పెద్ది'…
జనవరి 1న “సఃకుటుంబానాం”

హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు సోషల్ మీడియా ద్వారా మంచి ప్రశంసలు వచ్చాయి.
కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు రానున్న “సఃకుటుంబానాం” చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్ర విడుదల వాయిదా పడగా ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా 2026 జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 2026 సంవత్సరంలో అందరి జీవితాలు మరింత వెలుగు పొందాలని ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ “సఃకుటుంబానాం” చిత్ర బృందం నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానందుని తెలిపారు.
తారాగణం:
రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు.
సాంకేతిక బృందం:
రచన & దర్శకత్వం: ఉదయ్ శర్మ
నిర్మాత: హెచ్ మహదేవ గౌడ్
సంగీతం: మణి శర్మ
DOP: మధు దాసరి
ఎడిటర్: శశాంక్ మలి
కొరియోగ్రాఫర్: చిన్ని ప్రకాష్, భాను, విజయ్ పొలాకి
సాహిత్యం: అనంత శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: P.S. వర్మ
ఫైట్స్: అంజి, కార్తీక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రోహిత్ కుమార్ పద్మనాభ
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ : డిజిటల్ దుకాణం
