Skip to content

‘సరస్వతి’ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకుంటుంది: నిర్మాత పూజా శరత్ కుమార్

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత పూజా శరత్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచకున్నారు.

సరస్వతి ఎలా ఉండబోతుంది?
సరస్వతి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్న వన్ ప్యాకేజ్ పటాక. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. రెండు గంటల సినిమాని ఎంత గ్రిప్పింగా చేయాలో అంత అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దాం.

ప్రియమణి క్యారెక్టర్ గురించి?
-ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. వరలక్ష్మి మంచి విజన్ తో ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసింది. ఆ క్యారెక్టర్ కి ప్రియమణి గారు పర్ఫెక్ట్ యాప్ట్. చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

మీ బ్యానర్ దోశ డైరీస్ గురించి ?
బ్యానర్ కి ఏదైనా మంచి పేరు పెట్టాలి అనుకున్నప్పుడు ఫుడ్ తో కనెక్షన్ నా పేరు అయితే అందరికీ కనెక్ట్ గా ఉంటుందని అనుకున్నాం. వరలక్ష్మికి దోశ చాలా ఫేవరెట్. దోస డైరీస్ ఐడియా అందరికీ నచ్చింది.

మీకు ముందు నుంచి ప్రొడక్షన్ అంటే ఆసక్తి ఉందా?
నాకు ప్రొడక్షన్ పై ఆసక్తి ఉంది. చాలా మ్యూజిక్ షోలు చేశాను. అందులో రహమాన్ గారివి కూడా ఉన్నాయి. తర్వాత రడార్ లో కొన్నేళ్ళు పని పనిచేశాను. నాకు కెమెరా వెనక ఉండడమే ఇష్టం. అసలు యాక్టింగ్ రాదు.

సరస్వతి సినిమాకి ఇన్స్పిరేషన్ ఏంటి?
ఇదొక క్రైమ్ థ్రిల్లర్. చాలా మంచి సోషల్ మెసేజ్ ఉం.ది ఈ ట్రైలర్ లో ప్రతి అమ్మాయి సరస్వతి లాగా ఉండదు సమయం వస్తే కాళీలా మారుతుంది అనే ఒక డైలాగ్ ఉంది. ఈ కథ వెనుక ఉన్న ఆలోచన అదే. ఒక స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ ఇందులో చూస్తారు. చాలా బలమైన కథ ఇది. వరలక్ష్మీ చాలా పర్సనల్ గా కనెక్ట్ అయిన కథ.

ఈవిన్ గురించి?
-ఈ కథ ఈటీవీ బాపినీడు గారి చెప్పాం, వారికి చాలా నచ్చింది. మేమే చేస్తామని చెప్పారు.

ఇందులో కోర్టు సీన్స్ ఎలా ఉంటాయి?
-ఇందులో కోర్ట్ సీన్స్ చాలా ఇంపార్టెంట్. దాదాపు 7 నిమిషాల సింగిల్ షాట్ ఒకటి ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ కథకి చాలా కనెక్ట్ అవుతారు. అందరు ఆడియన్స్ చూడదగ్గ సిని ఇది.

ఈ సినిమాని తెలుగులోనే తీయడానికి కారణం?
వరలక్ష్మి ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయి అయిపోయింది. తన డైరెక్షన్ చేస్తున్న తొలి సినిమా తెలుగులోనే ఉండాలని తన బలంగా కోరుకుంది.

తమన్ గారి మ్యూజిక్ గురించి?
ఆయన మ్యూజిక్ విన్న తర్వాత మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. ఇందులో చాలా డిఫరెంట్ తమన్ గారిని వింటారు అది సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది.

-వరలక్ష్మి ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అద్భుతమైన ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారితో పాటు అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కథలో కీలకంగా ఉంటాయి.

శరత్ కుమార్ గారు సపోర్ట్ గురించి?
-ఆయన ఈ సినిమా విషయంలో మాకు చాలా సపోర్ట్ చేశారు. సినిమా ఎలా జరుగుతుంది? అని కాల్ చేసి తెలుసుకునేవారు. అవుట్ పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు.

-వరలక్ష్మికి ఇది చాలా ఎమోషనల్ అండ్ ప్రౌడ్ మూమెంట్. పరిశ్రమలో తన జర్నీ చాలా స్ఫూర్తిదాయకం.

ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారా?
మార్చి 5న ఒక ప్రీమియర్ అనుకుంటున్నాం. సినిమాపై మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. జనవరి 6న ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మిగతా భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు?
దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఆలోచన ఉంది. ఈ రోజుల్లో కథ అనేది రెలవెంట్ గా ఉండాలి. అలాంటి రిలెవెన్స్ ఉన్న కథలు కోసం చూస్తున్నాం. మా సంస్థ నుంచి ఎ జోనర్ సినిమా వచ్చినా అది బాగుండాలనేడే మా లక్ష్యం.

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గురించి
-బన్నీ వాసు గారికి కంటెంట్ చాలా నచ్చింది. రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు.
అలాగే బాలకృష్ణ గారికి ట్రైలర్ చాలా నచ్చింది. ఆయన విజివల్స్, డైలాగ్స్ చాలా ఎంజాయ్ చేశారు. దాదాపు గంటపాటు మాతో సమయాన్ని స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి?
-కొన్ని స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నాము. ఫైనల్ అవ్వగానే పూర్తి వివరాలు తెలియజేస్తాం.