Skip to content

కింగ్ బుద్ధ డైరెక్టర్ సత్యారెడ్డికి ఢిల్లీలో ఘన సన్మానం

కింగ్ బుద్ధ  డైరెక్టర్ సత్యారెడ్డికి ఢిల్లీలో ఘన సన్మానం Telugu News
కింగ్ బుద్ధ  డైరెక్టర్ సత్యారెడ్డికి ఢిల్లీలో ఘన సన్మానం Telugu News

దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లొ జరిగిన నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ అవార్డ్స్ ఫంక్షన్ లో చీప్ గెస్ట్ గా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి బహుమతులు ప్రధానం చేసి అవార్డులు అందించిన తెలుగు సేన పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జనం పత్రిక అధినేత, కింగ్ బుద్ధ హాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ సత్యారెడ్డిని ప్రపంచంలోనే 100 భాషల్లో కింగ్ బుద్ధ ఐ వాంట్ వరల్డ్ పీస్ అనే హాలీవుడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఘనంగా సన్మానించి సత్కరిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన నాట్య గురువులు బుద్ధ భగవానుని అభిమానులు. ఈ సందర్భంగా హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని ఏపీ భవన్లో అనేక రాష్ట్రాలకు చెందిన నృత్య కళాకారులకు తన స్వహస్తాలతోటి బహుమతులు ప్రధానం చేసి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కళాకారులను ప్రోత్సహించడంలో తాను ముందు ఉంటానని తన్ను ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీ నడిబొడ్డున తనకు జరిగిన సన్మానాన్ని తను మర్చిపోలేనని తన లైఫ్ లో ఇదొక మధురానుభూతిగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. నృత్యంలో ప్రావీణ్యత కలిగిన టాలెంటెడ్ పర్సన్స్ ని తాను కింగ్ బుద్ధ చిత్రంలో పరిచయం చేస్తానని సత్యా రెడ్డి మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన నృత్య కళాకారులు కూచిపూడి వెస్టన్ డాన్సులతోటి ప్రేక్షకుల్ని అలరించారు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.