‘ఆకాశంలో ఒక తార’ నుంచి బిజిలీగా రుహానీ శర్మ ఫస్ట్ లుక్ రిలీజ్- నవంబర్ 20న పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ముఖ్యమైన పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఈ సినిమాలో బిజిలీగా నటిస్తున్న రుహానీ శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కిటికీ పక్కన కూర్చుని కనిపిస్తున్న ఆమె సంప్రదాయ దుస్తుల్లో సింపుల్‌గా, అందంగా ఆకట్టుకున్నారు. ప్లజెంట్ ప్రెజెంటేషన్‌లో రుహానీ సహజమైన అందంతో మెరిసింది. బిజిలీ పాత్ర సినిమాలో…
