కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్ రామచంద్ర దీనస్థితి
▪️ఒకప్పుడు కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు ▪️ నేడు పక్షవాతంతో మంచానికే పరిమితం! ▪️ వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు ▪️ సినీ పరిశ్రమకు, దాతలకు వేడుకోలు ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు విరబూసేవి. తనదైన మార్క్ కామెడీ టైమింగ్, సహజసిద్ధమైన నటనతో వందకు పైగా చిత్రాల్లో అలరించిన ఆ నటుడి జీవితం ఇప్పుడు దీనస్థితిలో ఉంది. ఒకప్పుడు అందరినీ నవ్వించిన ఆ పెదవులు.. నేడు అనారోగ్యంతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సహాయం కోసం ఆర్తిగా వేడుకుంటున్నాయి. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రామచంద్ర తీవ్ర అనారోగ్యంతో పక్షవాతం బారినపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ తొలి చిత్రం 'నిన్ను చూడాలని' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రామచంద్ర, ఆ…
