ప్రైమ్ వీడియోలో ‘జగమే సంగీతం’
సంగీతం, కుటుంబం, వారసత్వం, ప్రేమ, అనుబంధాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం చేసే ప్రయాణం.. ఇలా ఎన్నో అంశాల కలయికగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కర్ణాటక సంగీతం నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరి ఈ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలో 5 కారణాలు ఇవే.. 1. మాటలకు అందని భావాలను సంగీతంతో చెప్పే కథ ‘జగమే సంగీతం’లో ఓ కుటుంబం కథ మొత్తం సంగీతంతో ముడిపడి ఉంటుంది. కర్ణాటక సంగీతం నేపథ్యంగా ప్రేమ, కోపం, ఆశయం, అనుబంధం, కుటుంబ వారసత్వం వంటి అంశాలను చూపించారు…
