తెలుగు సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వెళ్లాలి – “ఏకం కాన్ క్లేవ్” లో ప్రొడ్యూసర్ బన్నీవాస్
తెలుగు సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ కు రీచ్ కావాలని, నిర్మాతగా తాను అదే కోరుకుంటానని అన్నారు ప్రొడ్యూసర్ బన్నీ వాస్. ఆయన హైదరాబాద్ లో జరిగిన ఏకం బిజినెస్ కాన్ క్లేవ్ లో అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 300 మంది వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బన్నీవాస్ మాట్లాడుతూ - మన జీవితంలో కష్టం సుఖం ఎలా ఉంటాయో సినిమా బిజినెస్ లోనూ లాభాలు, నష్టాలు సహజం. ఈ రోజు నేను పోగొట్టుకుంటే రేపు సంపాదిస్తాననే నమ్మకంతో ముందుకు వెళ్తుంటాం. మిగతా వ్యాపారాలు కొన్నేళ్లకు బోర్ కొడుతుంటాయి. కానీ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు ఏ రోజూ విసుగురాదు. ప్రతి రోజూ…
