Skip to content

ప్యారడైజ్ ‘ఆయా షేర్’ సాంగ్‌కి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది: సుధన్ మాస్టర్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా టాప్ లో ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. 'ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయా షేర్ సాంగ్ కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆయా షేర్ పాట వరల్డ్ వైడ్ వైరల్ అవుతోంది.. అసలు ఈ పాట జర్నీ ఎలా మొదలైంది? -ఈ సినిమా…

Read more

9 దేశాల టాప్ మ్యూజిక్ చార్టులలో అదరగొడుతున్న ‘ది ప్యారడైజ్’ ఆయా షేర్ సాంగ్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ది పారడైస్ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విడుదలైన కొద్దిసేపటికే ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ పాట యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో 9 దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. భారత్, యూఏఈలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, సౌదీ అరేబియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించింది. ఒక తెలుగు పాటకు ఈ స్థాయి అంతర్జాతీయ ఆదరణ రావడం విశేషం…

Read more

రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో మూవీ

ఇండియన్ సినిమా లెజెండ్స్ గా కోట్లాది మంది ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకున్నారు రజనీకాంత్, కమల్ హాసన్. వీరు కలిసి నటించే సినిమా కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ మోస్ట్ అవేటెడ్ సినిమాను మన ముందుకు తీసుకురాబోతోంది ప్రెస్టీజియస్ బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్. 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీని నిర్మిస్తోందీ సంస్థ. "KHxRK"వర్కింగ్ టైటిల్ తో ఈ అరుదైన చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ అనౌన్స్ చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. 70వ దశకంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. ఆ తర్వాత తమదైన పంథాలో వెళ్తూ భారతీయ…

Read more

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ఫిబ్రవరి 24న రిలీజ్

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన పాన్ వరల్డ్ సినిమా 'ది ప్యారడైజ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ కాన్వాస్ పై నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సినిమాపై హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేశాయి. ఇప్పుడు, మేకర్స్ బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వేడుకలకు టీమ్ సిద్ధమవుతోంది. అదే రోజున చిత్రంలోని ఫస్ట్ సింగిల్ “ఆయా షేర్”ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గూస్‌బంప్స్ తెప్పించే ఈ ఇంట్రడక్షన్ ట్రాక్‌తో సినిమా ప్రమోషన్స్‌కు ఘనమైన ఆరంభం ఇవ్వబోతున్నారు మేకర్స్. ఈ పాటను వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో చిత్రీకరించారు…

Read more

‘ది ప్యారడైజ్’ నాని ఇంట్రో సాంగ్ షూటింగ్ ప్రారంభం

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, షూటింగ్ ఫ్లోర్ నుంచి తాజా అప్‌డేట్‌తో భారీ హైప్‌ను సృష్టిస్తోంది. వందలాది మంది డ్యాన్సర్స్ కూడిన భారీ సెట్‌లో నాని బ్లాస్టింగ్ ఇంట్రో సాంగ్ ఆయా షేర్ షూటింగ్ ని టీం ప్రారంభించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ గ్రిట్, హై-అడ్రినలిన్ వైబ్‌లతో నిండిన ఎలక్ట్రిఫైయింగ్ మాస్ బ్యాంగర్‌ అందించారు. రా ఎనర్జీతో నాని డ్యాన్స్ స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్ సాంగ్. విజయ్ 'జన నాయగన్' కు పని చేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్, షార్ప్…

Read more

#తలైవర్173 షూటింగ్ త్వరలో ప్రారంభం

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ #తలైవర్173 మాగ్నమ్ ఓపస్ కు దర్శకుడిని అనౌన్స్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారు. ఇది నెక్స్ట్ లెవల్ సినిమాటిక్ గ్రాండియర్‌ గా వుండబోతోంది. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మాణంలో #తలైవర్173 రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లెగసీ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోనుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం మాస్ అప్పీల్, ఎమోషన్, హై క్యాలిటీ మేకింగ్ తో ప్రేక్షకులని అలరించబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుంది. త్వరలోనే తారాగణం, టెక్నికల్ టీం గురించి మరిన్ని వివరాలను రివిల్ చేయనున్నారు…

Read more

‘ది పారడైజ్’ నుంచి నాని పోస్టర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ది పారడైజ్' ప్రతి అప్‌డేట్ ఈ సినిమా కోసం ఎక్సయిట్మెంట్ మరింతగా పెంచుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. మేకర్స్ రిలీజ్ చేసిన నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని జడల్ పాత్రలో పవర్ ఫుల్ గా,…

Read more

“బాలి” చిత్రం పోస్టర్, గ్లింప్స్ రిలీజ్

పాలిక్ స్టూడియోస్, బి ఎస్ ఆర్ కె, డి ఆర్ ఎస్ మరియు ఆర్ ఎస్ క్రియేషన్ టీమ్ వర్క్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "బాలి". ఈ చిత్రానికి పాలిక్ కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. మారుమూల ప్రాంతంలోని ఒక తాండాలో జరిగిన యధార్థ కథని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు జన్మలకు సంబంధించిన ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ మనిషికి భగవంతుడు తోడైతే అనే ఒక మంచి కథ నేపథ్యంతో నిర్మిస్తున్న చిత్రం "బాలి". ఈ చిత్రంలో ఐదు పాటలు, ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు, కామెడీ, సెంటిమెంట్ అన్ని కల కలుపుకొని ఒక చక్కటి జానపద చిత్రంగా మీ ముందుకు రాబోతుంది అన్నారు దర్శకుడు పాలిక్…

Read more