“లవ్ జాతర” నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్ రిలీజ్
అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ ప్రొడక్షన్ బ్యానర్ లో "సమ్మతమే" ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా "లవ్ జాతర". ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ గా "లవ్ జాతర" సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు బ్యూటిఫుల్ హీరోయిన్ మానస చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ "లవ్ జాతర" సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. మానస చౌదరి ఈ చిత్రంలో శ్రద్ధ పగడాల అనే అందమైన అమ్మాయి క్యారెక్టర్ లో ప్రేక్షకులు అలరించబోతోంది. ట్రెడిషనల్ వేర్ లో వర్షంలో సంతోషంగా డాన్స్ చేస్తున్న స్టిల్ తో…
