”అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్” ను ప్రారంభించిన ఉపాసన
మహిళలు, తల్లులు, నవజాత శిశువులు, పిల్లలకు మరింత ప్రత్యేకమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ‘అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్’ ను మంగళవారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఉపాసన కామినేని కొణిదెల ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. ఇకపై ఈ వైద్య కేంద్రాన్ని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్’గా పిలుస్తామని ఆమె ప్రకటించారు. ఈ కొత్త ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేకమైన ఆబ్స్టెట్రిక్స్ విభాగం, లెవల్ III నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU), అలాగే పెరినాటల్ సెంటర్ అందుబాటులో ఉన్నాయి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్, పిండం ఆరోగ్య పరీక్షలు, హైరిస్క్ ప్రెగ్నెన్సీల నిర్వహణ, మెటర్నిటీ కేర్, ప్రత్యేకమైన లేబర్ అండ్ డెలివరీ సేవలు,…
