పెద్ది పహిల్వాన్’ అవతార్‌తో ఆశ్చర్యపరిచిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం చేసిన ఫియర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ స్పెషల్ గ్లింప్స్‌తో పాటు వచ్చిన పోస్టర్లు ఆయనను పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించాయి. పహిల్వాన్ లుక్‌లో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులని సర్ప్రైజ్ చేసింది. ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ విడుదలైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్ తో దేశవ్యాప్తంగా నెం.1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమాలో చరణ్ బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ పూర్తిగా రా అండ్ ఫెరోషియస్‌గా కనిపిస్తోంది. నిజమైన ఫైటర్‌లా కనిపించే బలమైన భుజాలు, చేతులు, భారీ ఛాతీ, కండలు తిరిగిన దేహంతో అసలైన పహేల్వాన్‌గా కనిపించారు. రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే విజువల్స్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను మరింత…
