ఆగస్ట్ 23 నుంచి తొలి తమిళ ఐడిల్ ఆడిషన్స్ ప్రారంభం
సూపర్ జడ్జ్ ఎ.ఆర్. రెహమాన్ ప్రకటనతో తొలి ‘తమిళ్ ఐడల్’ ఆడిషన్స్‌కు శ్రీకారం చుట్టిన ‘సోనీ విళా’, ‘సోనీ లివ్’ సంయుక్తంగా తమిళనాడులో తదుపరి సింగింగ్ సెన్సేషన్ కోసం అతిపెద్ద ప్రతిభాన్వేషణకు అడుగులు వేయటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తమిళనాడులో తదుపరి సంగీత సంచలనాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తోన్న అతిపెద్ద ప్రతిభాన్వేషణకు చెన్నై వేదిక కానుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘తమిళ్ ఐడల్’ తొలి ఆడిషన్స్ ఆగస్టు 23న ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఈ జర్నీలో భాగంగా సూపర్ జడ్జ్ ఎ.ఆర్. రెహమాన్ ప్రకటించిన ‘తమిళ్ ఐడల్’.. తమిళనాడులోని యువ, ఔత్సాహిక గాయకులను తమ ప్రతిభను చాటుకుని, జీవితంలో మరచిపోలేని అద్భుతమైన సంగీత ప్రయాణానికి తొలి…
