స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు…
ఆగస్ట్ 23 నుంచి తొలి తమిళ ఐడిల్ ఆడిషన్స్ ప్రారంభం
సూపర్ జడ్జ్ ఎ.ఆర్. రెహమాన్ ప్రకటనతో తొలి ‘తమిళ్ ఐడల్’ ఆడిషన్స్‌కు శ్రీకారం చుట్టిన ‘సోనీ విళా’, ‘సోనీ లివ్’ సంయుక్తంగా తమిళనాడులో తదుపరి సింగింగ్ సెన్సేషన్ కోసం అతిపెద్ద ప్రతిభాన్వేషణకు అడుగులు వేయటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తమిళనాడులో తదుపరి సంగీత సంచలనాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తోన్న అతిపెద్ద ప్రతిభాన్వేషణకు చెన్నై వేదిక కానుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘తమిళ్ ఐడల్’ తొలి ఆడిషన్స్ ఆగస్టు 23న ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.
ఈ జర్నీలో భాగంగా సూపర్ జడ్జ్ ఎ.ఆర్. రెహమాన్ ప్రకటించిన ‘తమిళ్ ఐడల్’.. తమిళనాడులోని యువ, ఔత్సాహిక గాయకులను తమ ప్రతిభను చాటుకుని, జీవితంలో మరచిపోలేని అద్భుతమైన సంగీత ప్రయాణానికి తొలి అడుగు వేయాల్సిందిగా ఆహ్వానిస్తోంది. 14 నుంచి 30 ఏళ్ల వయసు గల ఔత్సాహిక గాయకులు చెన్నైలోని మేల్‌అయనంబాక్కంలోని వేళమ్మాల్ విద్యాలయ అనెక్స్‌చర్‌లో జరిగే ఆడిషన్స్‌లో పాల్గొని ఈ ప్రతిష్ఠాత్మక ప్రతిభాన్వేషణలో భాగమయ్యే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు.
‘సోనీ విళా’, ‘సోనీ లివ్’ సంయుక్తంగా తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ‘తమిళ్ ఐడల్’.. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న వైవిధ్యభరితమైన, అసాధారణమైన సంగీత ప్రతిభను సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతోంది.
‘సోనీ విళా’ గురించి..
‘సోనీ విళా’.. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI)కు చెందిన తమిళ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్. తమిళ సంస్కృతి, కథలు, సంగీతం, ఆహారం, పండుగలు, నిత్య జీవితంలోని అనుభూతులను సెలబ్రేట్ చేసే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ఛానల్‌ను రూపొందించారు. ‘విళా’ అంటే తమిళంలో వేడుక లేదా పండుగ అని అర్థం. అదే స్ఫూర్తితో.. అన్ని తరాల తమిళ ప్రేక్షకుల కోసం ఒరిజినల్ ప్రోగ్రామ్స్, రియాలిటీ ఫార్మాట్స్, సినిమాలు, గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను ‘సోనీ విళా’ అందించనుంది. ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’, ‘తమిళ్ ఐడల్’ వంటి ఫ్లాగ్‌షిప్ షోలతో.. తమిళ సంస్కృతికి బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ, కొత్త తరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రీమియం, ప్రోగ్రెసివ్, డిఫరెంట్ తమిళ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడమే ‘సోనీ విళా’ లక్ష్యం.
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురించి……
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌గా పిలువబడేది) జపాన్‌కు చెందిన సోనీ గ్రూప్ కార్పొరేషన్‌కు పరోక్షంగా పూర్తి అనుబంధ సంస్థ. ప్రముఖ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థగా కొనసాగుతున్న SPNI.. SD, HD ఫార్మాట్లలో మొత్తం 29 ప్రీమియం ఛానళ్లను నిర్వహిస్తోంది. ఈ నెట్‌వర్క్‌లో ప్రముఖ హిందీ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లైన సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్, సోనీ SAB, సోనీ PAL; మరాఠీ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ సోనీ మరాఠీ; బెంగాలీ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ సోనీ AATH; తమిళ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ సోనీ విళా; హిందీ మూవీ ఛానళ్లైన సోనీ MAX, సోనీ MAX 1, సోనీ MAX 2, సోనీ WAH ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ అభిమానుల కోసం సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్లో భాగంగా సోనీ స్పోర్ట్స్ TEN 1, సోనీ స్పోర్ట్స్ TEN 2, సోనీ స్పోర్ట్స్ TEN 3, సోనీ స్పోర్ట్స్ TEN 4, సోనీ స్పోర్ట్స్ TEN 5 ఛానళ్లు.. కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సోనీ YAY!.. ఇంగ్లీష్ మూవీ ఛానల్ సోనీ PIX.. ఫ్యాక్చువల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ సోనీ BBC Earth అందుబాటులో ఉన్నాయి.
https://www.instagram.com/p/DcQBC17peuq

