మార్చి 13 నుండి ZEE5 లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’..
మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రలు పోషించారు. కావాల్సినంత కామెడీ, గుండెల్ని తాకే ఎమోషన్స్‌ను మిళితం చేసి ఈ కథను కిషోర్ తిరుమల తెరపైకి తీసుకు వచ్చారు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీగా ఉంది. మార్చి 13 నుంచి ఈ మూవీ జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. దక్షిణాది భాషల్లో ఈ మూవీ డబ్బింగ్…
