శ్రీ అమ్మ భగవాన్ బోధనల నేపథ్యంలో “ఏదైనా సాధ్యమే” మూవీ
ఫిలిం చాంబర్‌లో టైటిల్ ఆవిష్కరణ హైదరాబాద్: ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలను మేళవిస్తూ శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సరికొత్త చిత్రం "ఏదైనా సాధ్యమే". ఈ సినిమాకు "దైవం తోడుంటే.." అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మద్దూరి రాజా, నిర్మాత అనిల్ మునగనూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాల్గొన్నారు. ప్రతి మనిషి తన ఇష్ట దైవంతో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలోని దుఃఖాల నుండి, బాధల నుండి ఎలా విముక్తి పొందవచ్చనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాణం మొత్తం "శ్రీ అమ్మ…
