‘అమీర్ లోగ్’ లాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది: వంశీ నందిపాటి
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేద జలంధర్ , రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో నిర్మాత వంశీ నందిపాటి మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో.. వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ మూవీని నేను ఆల్రెడీ చూశాను. డబ్బు పరంగా రిచ్ అని అనుకుంటారు. కానీ స్నేహం, ప్రేమ విషయంలో రిచ్…
