పొలిమేర 3′ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదల
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పోషిస్తున్న 'విరావి' పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లో అర్జున్ సర్జా శక్తిమంతమైన, ఆసక్తికరమైన లుక్‌లో కనిపించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్)కు చెందిన భరత్ నారంగ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు…
