‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం..
శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్న చిత్రం ‘చోర శికామణులు’. ఆనంద్ కుర్మా ఈ మూవీకి కథ, కథనం, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, క్రైమ్, కామెడీ జానర్లో రానున్న ఈ మూవీలో రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. ‘చోర శికామణులు’ చిత్ర ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలకు త్రినాథరావు నక్కిన, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు నక్కిన గౌరవ…
